పేద ప్రజలే నా దేవుళ్ళు..

– నెలకు ఒక్క రూపాయి జీతంతో పనిచేస్తా
– రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం
– ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్
నవతెలంగాణ- తాడ్వాయి
పేద ప్రజలే నా దేవుళ్ళు…పేదల కోసమే నిరంతరం పనిచేస్తానాని, నా జీవితం పేదలకే అంకితం చేస్తానని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ తెలిపారు. తాడ్వాయి మండలంలో ఆయన ఆదివారం ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు నాయకులు, కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు. తాడువాయలో శబరిమాత ఆలయం నుంచి తాడ్వాయిలోని ప్రధాన వీధుల గుండా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు స్వాగతం పలుకుతూ మదన్ మోహన్ ను ఆహ్వానించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు తీసుకొచ్చి ఊరేగించారు అనంతరం తాడ్వాయిపాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… తన జీవితమంతా పేద ప్రజలకే అంకితం చేస్తానని తెలిపారు. తీవ్రమైన కరోనా సమయంలో తాను ఇంటి నుంచి బయటకు వచ్చి పేద ప్రజల ప్రాణాలు కాపాడానని అన్నారు.తన ప్రాణాలు లెక్కచేయకుండా పేద ప్రజల కోసం పని చేశానని తెలిపారు. తాను కరోన సమయంలో చావు నోట్లోకి వెళ్లి తిరిగి వచ్చానన్నారు. కరోనా సమయంలో తన భార్య బయటకు వెళ్ళవద్దని సూచించిన చావును లెక్కచేయకుండా కరోనా సమయంలో పేద ప్రజల కోసం బయటే తిరిగానని తెలిపారు. ఎల్లారెడ్డిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొందిన జాజాల సురేందర్ కెసిఆర్ కు డబ్బులకు అమ్ముడుపోయాడన్నారు. కేసీఆర్ కు డబ్బులకు అమ్ముడుపోయి తాను సంక్షేమ పథకాల కోసమే బీఆర్ఎస్ పార్టీలో కలిశానని తప్పుడు మాటలు చెప్పాడని విమర్శించారు. ప్రతి పనిలో 40 శాతం కమిషన్లు తీసుకుంటూ తన స్వార్థం కోసం పనిచేసిన సురేందర్ కు గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరగలేదన్నారు ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు అందించారా అని ప్రశ్నించారు కుటుంబంలో పిల్లలు జన్మిస్తే వారి పేర్లు సైతం రేషన్ కార్డులో నమోదు కాలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందగానే తాడువాయి మండల కేంద్రంలో క్రీడాకారుల కోసం అధునాతనమైన స్టేడియాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రాష్ట్రాన్ని దొంగల్లా దోచుకున్న టిఆర్ఎస్ పార్టీకి గట్టి గుణపాటమే చెప్పాలని కోరారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇంట్లోనే అయిదుగురికి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు.
ఒక్క రూపాయి జీతంతో పనిచేస్తా
తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నెలకు ఒక్క రూపాయి జీతంతో పని చేస్తానని తెలిపారు. ప్రభుత్వం ఎమ్మెల్యేకు అందించే జీతాన్ని తీసుకొని ఆ జీతంతో నియోజకవర్గంలోని పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.తనపై ప్రజలు చూపుతున్న ఆదరణ వెలకట్టలేనిది అన్నారు నిస్వార్ధంగా ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు కరోనా సమయంలో తాను ప్రతి గ్రామంలో, తండాలో గ్రామాలను శానిటేషన్ చేయించానని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న సురేందర్ ఏ గ్రామానికి తిరుగలేదన్నారు. ఆయన ఇంటికే పరిమితం అయ్యాడని విమర్శించారు తన కుటుంబంలో బయటకు వెళ్ళవద్దని చెప్పిన తాను చావుకు భయపడకుండా బయటకు వెళ్లి ప్రజలతోనే గడిపానన్నారు ఇప్పటికే నియోజకవర్గంలోని చాలామంది నిరుద్యోగ యువకులకు తన కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు ఎమ్మెల్యేగా గెలుపొందగానే నియోజకవర్గానికి ప్రత్యేక కంపెనీలు తీసుకువచ్చి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు
 ప్రతి మండల కేంద్రంలో ఎమ్మెల్యే హెల్ప్ లైన్ లో ఏర్పాటు
ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలుపొందగానే ప్రతి మండల కేంద్రంలో ఎమ్మెల్యే హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు పేద ప్రజలు ఏ అవసరాలు ఉన్న ఎమ్మెల్యే హెల్ప్ లైన్ వద్ద సమాచారం అందించాలని సూచించారు. తాను వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు రాష్ట్రంలో కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుని దాచుకున్నారని విమర్శించారు మరోసారి గెలుపొందితే ప్రభుత్వ భూములు లాక్కునే ప్రమాదం ఉందన్నారు. మీకు భూములు లాక్కునే ప్రభుత్వం కావాలా భూములు పంచే ప్రభుత్వం కావాలా అని ప్రజలను ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెన్షన్ల లబ్ధిదారులను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకపోతే పెన్షన్ కోల్పోతారని భయపెడుతున్నారని తెలిపారు అలాంటి వారి మాటలు నమ్మవద్దని పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుందని వాళ్ళ ఇంటి నుంచి ఇవ్వట్లేదని తెలిపారు ఖబర్దార్ నాయకుల్లారా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరించారు అనంతరం దేమి కలాన్, కన్కల్ ,కరాడ్ పల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు మూడు గ్రామాలలో సైతం పెద్ద సంఖ్యలో జనాలు మదన్మోహన్ కు స్వాగతం పలికారు బోనాలతో ఊరేగించారు కన్కల్ గ్రామంలో భారీ కులమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకిటి సుగుణాకర్ రెడ్డి, గడ్డం వెంకట్రామిరెడ్డి, జంగం రాజు, అంబీర్ శ్యామ్ రావు, మెట్టు రామచంద్రం, జలంధర్ రెడ్డి, అంబీర్ మధుసూదన్ రావు, నల్లవెల్లి సాయి రెడ్డి, ప్రతాప్ రెడ్డి , మురళీమోహన్ ,కంది శివరాములు తదితరులు పాల్గొన్నారు