పేద ప్రజల ఆశా ద్వీపం.. బుసిరెడ్డి ఫౌండేషన్.!

Island of hope for poor people.. Busireddy Foundation.!– నేనున్నానంటూ భరోసా
– అందరికి  మనోధైర్యం
నవతెలంగాణ – పెద్దవూర
అందరికి అండగా వుంటా, అన్ని విధాలుగా ఆదుకుంటా అని పేద ప్రజల ఆశా ద్వీపం బుసిరెడ్డి పాండురంగారెడ్డి అంటున్నారు. ఆదివారం నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన జక్కల కవ (25 )మృతి చెందారు.ఈ విషయం తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ భోజనాలు పంపించారు.ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి  బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356  కు సంప్రదించవలసినదిగా కోరారు. ఈసందర్బంగా మాట్లాడుతూ.. మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానం మాత్రమేనని, భగవంతుడు ఇచ్చిన సంపదలో మనిషి బ్రతికివున్నన్ని రోజులు మంచి భావనతో నాలో దైవత్వాన్ని అలవరుచుకొని దానధర్మాలు చేస్తున్నానుఅని  బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి అన్నారు.నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యకమాలు చేపట్టడం జరిగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.