హాస్పటల్లో రోగులను పరామర్శించిన మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ

నవతెలంగాణ -తాడ్వాయి

 మండలంలోని గంగారం గ్రామపంచాయతీ లోని బంజర ఎల్లాపూర్ గ్రామానికి చెందిన గుమ్మడి సుగుణ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హన్మకొండ రోహిణి హాస్పిటల్ లో సర్జరీ చేయించుకుని వైద్యం పొందుతున్న సుగుణ ను, మంగపేట మండలం చీపురుదుబ్బ గ్రామానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మంకిడి బుచ్చయ్య,  ఆరేపల్లి ఎన్ ఎస్ ఆర్ హాస్పిటల్ లో వైద్యం పొందుతుండగా ఆదివారం సామాజిక న్యాయవేదిక ములుగు జిల్లా మహిళా అధ్యక్షురాలు మడే పూర్ణిమ పరామర్శించి, పండ్లను పంపిణీ చేశారు. మందులు సమయానికి వేసుకోవాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మడే బిక్షపతి, గ్రామస్తులు బంధువులు తదితరులు పాల్గొన్నారు.