మున్నూరు కాపులకు జనాభా ప్రతిపాదన ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి 

Population proposal should provide special reservation for Munnuru Kapus– మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 
– మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు రావుల ప్రభాకర్
నవతెలంగాణ –  కామారెడ్డి
మున్నూరు కాపులకు జనాభా ప్రతిపాదన ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, మునుర్కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరుకాపు సంఘం జిల్లా నాయకులు రావుల ప్రభాకర్ అన్నారు. ఆదివారం మాచారెడ్డి ఎక్స్ రోడ్లో మౌన పోరాట దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకుడు రావుల ప్రభాకర్ మాట్లాడుతూ మున్నూరు కాపుల జనాభా రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుందని ఆ ప్రతిపాదికన తమకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని, మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, నిధుల కేటాయించాలని కోరుతున్నామన్నారు. అనంతరం గజ్య నాయక్ తండా గ్రామ అధ్యక్షుడు ముదం నర్సింలు మాట్లాడుతూ తమ కులాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు మౌన దీక్ష చేశామనీ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మున్నూరు కాపు సంగం అధ్యక్షులు కొండా దేవయ్య , జిల్లా అధ్యక్షులు మామిండ్ల అంజయ్య ఆదేశాల మేరకు, జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ నీలం నర్సింలు  మాచారెడ్డి  మండల (మాచారెడ్డి x రోడ్ ) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం  నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు మ్యాడం ప్రభాకర్, సలహా దారులు శ్రీకాంత్, శ్రీనివాస్, కల్పన, ముదాం లక్ష్మి, రాజమణి, క్రాంతి కుమార్, నవీన్, నిఖిల్, భరత్, సూరజ్, శివచరణ్ తదితరులు పాల్గొన్నారు.