మృతుల కుటుంబాలను పరామర్శించిన పోరిక గోవింద నాయక్

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ బుధవారం పలువురు మృతుల కుటుంబాల ను పరామర్శించి ఓదార్చారు.చల్వాయి గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు బోడిగ రఘువీర్ తండ్రి బోడిగ సాంబయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతు మరణించగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి సాంబయ్య నివాసానికి వెళ్లి ఆయన భార్య,కుమారులు మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి సంతాపం ప్రకటించారు. అనంతరం మొద్దుల గూడెం గ్రామానికి చెందిన భూక్య పాపమ్మ గారి దశ దిన కార్యక్రమం సందర్బంగా ఆమె స్వగృహంలో చిత్రాపటానికి నివాళి అర్పించి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం ఆమె కుమారులు మరియు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి పాపమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ సానుభూతి తెలియజేసి సంతాపం ప్రకటించారు. గాంధీ నాగర్ గ్రామానికి చెందిన మాలోత్ చెందు – వర్ష గార్ల కుమారుడు రాహుల్ ప్రమాధవ శాత్తు చెరువులో పడి మరణించగా కుమారుడిని కోల్పోయి దుఃఖంలో ఉన్న చెందు వర్ష లను ఒదర్చి మనో ధైర్యాన్ని ఇచ్చారు.చిన్న వయస్సులోనే అకాల మరణం చెందడం ఎంతో భాధాకరం అని వారి పుత్రః శోకంలో ఉన్న రాహుల్ అమ్మానాన్నలకు రాబోయే రోజుల్లో అన్ని విధాలా అండగా నిలిచి ఆదుకుంటామని సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ గారితో పాటు స్థానిక సర్పంచ్ ఈసం సమ్మయ్య,మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు మోహన్ రాథోడ్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి లాకవత్ నరసింహ నాయక్, మోడల్ స్కూల్ చైర్మన్ రెండ్ల సంతోష్, మండల ఉపాధ్యక్షులు చుక్క గట్టయ్య, గ్రామ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి బైకానీ ఓదెలు, కొండా రమేష్, రేండ్ల శ్రీనివాస్, కొంపెల్లి కృష్ణా రెడ్డి, సామ సుందర్ రావు, రైతు కమిటీ అద్యక్షులు మీస రవి, ఎస్ సి సెల్ అధ్యక్షులు కుమ్మరి వెంకన్న, కార్యదర్శి గోధా కనుకయ్య, దర్శనాల సంజీవ,ఏనుగుల సాంబశివ రావు, అల్గం సమ్మయ్య, తాటి కొండ శ్రీనివాసా చారీ,మంచికలపూడి రేణుక,మెడుదల సింహాద్రి, మడి కొండ రమేష్, ఈనుముల సామెల్, ఏనగందుల మల్లయ్య,సాంబయ్య, పీరాల కృష్ణయ్య, సుడి సతీష్ రెడ్డి, ఊటుకూరి వేంకట రామయ్య,పసుల భద్రయ్య, బొల్లి రాజాలు, బానోత్ మౌంత్య, బానోత్ తౌర్య, మోతి లాల్, దేవజి, సంజీవ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు.