
అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 కాళేశ్వరం జోనల్ ఐదు జిల్లాల యువజన అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్,ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ సూచన మేరకు ఎడబ్ల్యూ మండల ఉపాధ్యక్షురాలుగా ఎడ్ల పొసక్కను ఏకగ్రీవంగా నియామకం చేసినట్లుగా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక,రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు.తమపై నమ్మకంతో ఈ పదవిని అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్,కాళేశ్వరం జోనల్ నాయకులు కుమార్ యాదవ్,బండి సుధాకర్ లకు సారయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ బాధ్యతపై అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీకి మంచి పేరు తీసుకవస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కొండ రాజమ్మ,కాటారం సబ్ డివిజన్ అధ్యక్షురాలు కొండూరి మమత, ఏఏప్ యు జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్ర సారయ్య, ఏవైయు జిల్లా ఉపాధ్యక్షుడు కేశారపు సురేందర్, ఏఈడబ్ల్యుఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇందారపు రంజిత్,కార్యదర్శి ఇoదారపు రాకేష్ పాల్గొన్నారు.