బీరెల్లీ, అంగన్వాడీల్లో పోషణ పక్వాడ్ వారోత్సవాలు

నవతెలంగాణ – తాడ్వాయి
ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే పోషణ పక్వాడ్ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని బీరెల్లీ గ్రామంలో పోషణ పక్వాడ్ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు చిరుధాన్యాల ఆవశ్యకత గురించి వివరిస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌష్టికాహార లోపం లేకుండా అందరూ కూడా సరైన పౌష్టికాహారం తీసుకోవాలని, చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. ఆడ మగ వివక్షత లేకుండా ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందుండేలా వారిని చదివించాలని, రక్షించాలని సూచించారు. ప్రీ స్కూల్ పిల్లలు 3 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించాలని కోరారు. అంగన్వాడి కేంద్రాల్లో చేర్పించిన చిన్నారులకు, ప్రీస్కూల్ బుక్స్, ప్రొఫైల్స్, అభివృద్ధి చార్ట్, పిల్లల పర్యవేక్షణ కార్డు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈమెటీరియల్ చిన్నారులకు మానసికంగా, ఆర్థికంగా, సాంఘిక స్థాయిని పెంచడానికి దోహదపడతాయన్నారు. శిశువు పుట్టగానే మురుపాలు పట్టిస్తే పోషకాలు అందుతాయన్నారు. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని సూచించారు. ఆరు నెలలు దాటిన వెంటనే తల్లిపాలతో పాటు అంగన్వాడిలో అందించే బాలామృతం గుడ్లు పెట్టాలని,  నీతో చిన్నారులకు పోషకాలు అంది శారీరకంగా ఎదుగుదల చదువుల్లో రాణించడానికి దోహదపడుతుందన్నారు. పోషణ పక్వాడ్ లో భాగంగా ప్రభుత్వం అంగన్వాడిలో అందిస్తున్న పోషకాహారాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీరెల్లి-1 అంగన్వాడి టీచర్ ఎం విజయ మాల, కామారం(బి)అంగన్వాడీ టీచర్ నాగమణి, ఆశన్నగూడ ఎల్లాపూర్ అంగన్వాడి టీచర్ జబ్బ సాంబలక్ష్మి,  బీరెల్లి-2 అంగన్వాడి కేంద్రం టీచర్ ఎం పద్మ, గర్భిణులు బాలింతలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.