
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని డోంగ్లి మండల కేంద్రంలో బుధవారం నాడు మండలంలోని అంగన్వాడి కేంద్రాల ద్వారా పోషణ అభియాన్, శ్రీమంతాలు, అక్షరాభ్యాసాలు, పోషణ మాసం ,తదితర కార్యక్రమాలను చేపట్టిన కార్యక్రమానికి మద్నూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ సునంద డోంగ్లి మండల తాసిల్దార్ రేణుక చౌహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సిడిపిఓ తాసిల్దార్ చిన్నారులకు అక్షర అభ్యాసాలను జరిపించారు గర్భిణీలకు శ్రీమంతాలు జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం చక్కటి కార్యక్రమాలను అంగన్వాడి కేంద్రాల పరిధిలో గల ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు అంగన్వాడీల ద్వారా అందించే పౌష్టికాహారం గర్భిణీలకు ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ మండల తహసీల్దార్ అలాగే ఆరోగ్యశాఖ ఆర్బికేఎస్ నాగర్జున డోంగ్లి మండలంలోని అంగన్వాడి కేంద్రాల టీచర్లు ఆయాలు గర్భిణీలు, చిన్నారులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు