గ్లోబల్‌ మార్కెట్లోకి పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌

Posidex Technologies enters the global market– కొత్త లోగోను ఆవిష్కరించిన పివి సింధు
హైదరాబాద్‌ : భారత్‌లో కస్టమర్‌ మాస్టర్‌ డేటా మేనేజ్‌మెంట్‌ సొల్యూషన్స్‌ను అందించే ప్రముఖ ప్రొవైడర్‌ పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ఇక గ్లోబల్‌ మార్కెట్‌లోకి విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం వ్యూహాత్మక రీబ్రాండింగ్‌, ప్రణాళికలు చేపడుతున్నట్లు వెల్లడించింది. సోమవారం హైదరాబాద్‌లో పోసిడెక్స్‌ టెక్నాలజీ నూతన లోగోను పివి సింధు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకులు, సిఇఒ కె వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ.. సంక్లిష్టమైన డేటా సవాళ్లను, డిమాండ్‌లను నిర్వహించడంలో తమ అపారమైన అనుభవాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్లోబల్‌ మార్కెట్లోకి ప్రవేశించడంపై తాము గర్వపడు తున్నామన్నారు. అంతర్జాతీయ సంస్థలకు తమ డేటా సెక్యూర్డ్‌, క్లౌడ్‌ ఉత్పత్తులను అందించనున్నామన్నారు. ప్రస్తుతం పోసిడెక్స్‌ దేశంలోని ఏడు బ్యాంక్‌లకు, తొమ్మిది ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సిలకు సేవలందిస్తుందన్నారు. ఈ విజయం ఆధారం గా అమెరికా, దుబారు, సింగపూర్‌, థాయిలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో క్రియాశీల మార్కెట్లపైన దృష్టి సారిస్తున్నామన్నారు. తమ నూతన బ్రాండ్‌ దృశ్యపరమైన మార్పు మాత్రమే కాదని.. తమ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేది లక్ష్యమని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దత్తా గౌరవెల్లి పేర్కొన్నారు.