సానుకూలం

positiveసమస్యలు, ఇబ్బందులు జీవితంలో సాధారణమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ”వెతికితే ప్రతిదాంట్లో మంచి విషయం ఉండకపోదు, వేలెత్తిచూపడానికి చెడు విషయాలు ఉండకపోవు” అని పెద్దలు చెప్పే మాటలో అంతరార్థాన్ని గ్రహించాలి. కష్ట సమయంలో చిన్న మంచి కూడా ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది. మనం అనుకున్నపనులు జరగకపోయినా, చేతిలో ఉన్నవి జారిపోయినా నిరుత్సాహపడకుండా వేరొక పని చేసుకోవడానికి ఇలా అవకాశం వచ్చిందని సానుకూల మనస్తత్వంతో ఆలోచించాలి. ఎదుటి వ్యక్తుల నుంచి పొందిన సహాయాన్ని మరచిపోకూడదు. పొందిన సహాయానికి ఎదుటి వ్యక్తులకు కతజ్ఞతలు చెప్పడం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మనలో అహాన్ని తగ్గిస్తుంది. కతజ్ఞతాభావం వ్యక్తం చేయడమంటే సహాయం చేసిన వారిని గౌరవించడం. దానివల్ల వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉంటాయి.
మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో సానుకూలమైనవి జరిగినప్పుడు ఎంతో సంబరపడిపోతాం. కానీ ప్రతికూలమైన సంఘటనలు జరిగినప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మానసికంగా చాలా ఆందోళనకు గురవుతాం. ప్రతికూల పరిస్థితిలో కూడా సానుకూల మనస్తత్వాన్ని కలిగి ఉండగలిగితే మనం తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి.
ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూలంగా ఉండటమంటే అది సమస్యల్లో ఉన్నప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండటం, ఆ సమస్యల్లో ఉన్న మంచిని గ్రహించడం. ఈ రకమైన స్వభావం అలవాటు చేసుకుంటే మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోగలిగే సామర్థ్యం మనలో పెరుగుతుంది. పరిస్థితులు ఎలాంటివైనా ప్రతిదాంట్లో మంచిని చూడగలిగితే సమస్య ప్రభావం వ్యక్తుల మీద పడకుండా ఉంటుందంటారు పెద్దలు. ఆ స్వభావం అలవాటు కావాలంటే ఆత్మవిమర్శ చాలా అవసరం. ఎవరికి వారు పరిస్థితుల గురించి అందులో ఉన్న మంచి గురించి చర్చించుకోవాలి.
సమస్యలు, ఇబ్బందులు జీవితంలో సాధారణమనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ”వెతికితే ప్రతిదాంట్లో మంచి విషయం ఉండకపోదు, వేలెత్తిచూపడానికి చెడు విషయాలు ఉండకపోవు” అని పెద్దలు చెప్పే మాటలో అంతరార్థాన్ని గ్రహించాలి. కష్ట సమయంలో చిన్న మంచి కూడా ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది. మనం అనుకున్నపనులు జరగకపోయినా, చేతిలో ఉన్నవి జారిపోయినా నిరుత్సాహపడకుండా వేరొక పని చేసుకోవడానికి ఇలా అవకాశం వచ్చిందని సానుకూల మనస్తత్వంతో ఆలోచించాలి. ఎదుటి వ్యక్తుల నుంచి పొందిన సహాయాన్ని మరచిపోకూడదు. పొందిన సహాయానికి ఎదుటి వ్యక్తులకు కతజ్ఞతలు చెప్పడం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. మనలో అహాన్ని తగ్గిస్తుంది. కతజ్ఞతాభావం వ్యక్తం చేయడమంటే సహాయం చేసిన వారిని గౌరవించడం. దానివల్ల వ్యక్తుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు ఉంటాయి.
మనలో పాజిటివ్‌ ఆలోచనలు పెరగాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండటం గొప్ప మార్గం. నవ్వు ఆందోళనలను, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు తేల్చి చెప్పారు. కఠిన పరిస్థితులలోనూ, బాధాకర పరిస్థితులలోనూ చెరగని చిరునవ్వును వెంట ఉంచుకునేవాళ్ళు గొప్ప ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రతిదాంట్లో చెడును చూడటం, ముందే చెడును ఎక్పెక్ట్‌ చేయడం, ఎప్పుడూ చెడు గురించి మాట్లాడటం చేసేవాళ్లను నెగిటివ్‌ మైండ్‌ ఉన్న వ్యక్తులు. ఇలాంటి వాళ్లు పాజిటివ్‌గా ఉన్న వాళ్ళను కూడా తమ మాటలతో గందరగోళంలోకి నెట్టేస్తుంటారు. అలాంటి వారికి కాస్త దూరంగా ఉండాలి.
ఎవరిని వారు ప్రశ్నించుకుంటూ, ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉంటే తమలో ఉన్న బలహీనతలు, తప్పులు చాలా తొందరగా గుర్తించవచ్చు. సాధారణంగా ఒక నిర్ణయం తీసుకున్నా మనసులో మాత్రం అది కాదు ఇది, ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే మనసు చెప్పేదాన్ని వినడం కూడా నేర్చుకోవాలి. అలాగే స్నేహితులు, ఆత్మీయుల ద్వారా మనలో ఉన్న ప్రతికూల స్వభావాన్ని, ఆ స్వభావం ఎప్పుడు ఏ విషయాల్లో ఎక్కువ ఉంటుంది అనేదాన్ని గుర్తించవచ్చు. అలా గుర్తించుకున్నాక దాన్ని మెల్లిగా తొలగించాలి. ఇలా సానుకూల స్వభావం అలవాటు అయితే జీవితంలో ఎన్నో ఆందోళనలు అసలు ఆందోళనల్లా, సమస్యల్లానే కనిపించవు.