కార్పొరేట్ అనుకూల బడ్జెట్

Corporate friendly budget– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పి.జగన్
– బడ్జెట్లో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతుల ప్రయోజనాలకు మొండి చేయి
– పోల్కంపల్లిలో బడ్జెట్ పత్రాలు దగ్ధం
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రతినిధి 
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ ప్రవేశపెట్టిన రూ.50,65,345 కోట్ల బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉండని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పి.జగన్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో  కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బడ్జెట్ పత్రాలను ఆదివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో దేశంలోని 40 కోట్ల మంది కార్మికుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు నిధులు కేటాయింపులు మొండి చేయి చూపారని విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద సంవత్సరానికి రెండు కోట్ల ఇండ్లను నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో అందుకు తగిన విధంగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు చెరుకూరి నర్సింహ్మా, గ్రామ కార్యదర్శి అమనగంటి నర్సింహా, సీనియర్ నాయకులు గూడెం అశోక్, శాఖ కార్యదర్శులు పంది.యాదయ్య, పి.స్వామి, కసరమోని జంగయ్య, పార్టీ నాయకులు కంబాలపల్లి ఇస్తారి, సొసైటీ డైరెక్టర్ సార్ల బాలయ్య, కంబాలపల్లి వెంకటేష్, ఏదుల్ల పాండు, అమనగంటి బాల్ రాజ్, చెరుకూరి బాల్ రాజ్, చెరుకూరి యాదయ్య, కట్టెల లక్ష్మణ్, పి.యాదయ్య, కంబాలపల్లి బాల్ రాజ్, వర్కాల శివ, వి.జంగయ్య తదితరులు పాల్గొన్నారు.