
నవతెలంగాణ – కామారెడ్డి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందనీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీకి అనుకూలంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ నుండి జీఎస్టీ మరియు టాక్స్ ల ద్వారా కోట్ల రూపాయలు కేంద్రా ప్రభుత్వానికి చెందుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణకు మొండిచేయి చూపించిందనీ, తెలంగాణలో గెలిచిన బిజెపి నుండి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు కేంద్ర మంత్రులు ఉన్న కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణకు నిధులు కేటాయించకపోతే రాజీనామా చేయాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నారు. సోమవారం ఇందిరాగాంధీ కూడలిలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన నియోజకవర్గ విభాగం, కామారెడ్డి అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి, ,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, షేరు ,రాజా గౌడ్ షేరు మైనార్టీ సెల్ సిరాజుద్దీన్, బీసీ సెల్ పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు జొన్నల నర్సింలు, రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లక్ష్మీరాజం, దోమకొండ శ్రీనివాస్, జ్యోతి రెడ్డి, పంపరి లక్ష్మణ్ శెట్టి, భాస్కర్, సర్వర్, జాకీర్, అజీజ్, పెన్సిల్వా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.