స్పార్క్‌కి పాటిజివ్‌ టాక్‌

Positive talk for Sparkవిక్రాంత్‌, మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’. విక్రాంత్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించటమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే కూడా అందించారు. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్‌తో సినిమా రన్‌ అవుతున్న సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్‌ రుక్సర్‌ థిల్లాన్‌ మాట్లాడుతూ, ‘మా ‘స్పార్క్‌’ మూవీ సక్సెస్‌లో భాగమైన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్‌. హీరో విక్రాంత్‌కి అభినందనలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఇదొక ఎక్స్‌పెరిమెంట్‌ మూవీ. నేను సంధ్య థియేటర్‌లో ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూశాను. అందరికీ ఓ డిఫరెంట్‌ ఫీలింగ్‌ కలిగింది. కొత్త కంటెంట్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్‌ అయ్యింది’ అని తెలిపారు. హీరో విక్రాంత్‌ మాట్లాడుతూ, ”మా స్పార్క్‌ మూవీ థియేటర్స్‌లో విడుదలైంది. మంచి రెస్పాన్స్‌ వస్తుంది. సంధ్య థియేటర్‌లో ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూశాను. సినిమాలో సాంగ్స్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, పెర్ఫామెన్స్‌లు, యాక్షన్‌ సీక్వెన్సులు అన్నీ నచ్చుతున్నాయి. సినిమా చూసిన వారందరూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. యూనిట్‌ను అభినందిస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లోని చివరి 20 నిమిషాలకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. సుహాసిని, గురు సోమసుందరం క్యారెక్టర్స్‌లో ఉండే ట్విస్టులను ఊహించలేకపోతున్నారు. కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌. అన్నీ ఎలిమెంట్స్‌తో కంప్లీట్‌ మూవీగా ఈ సినిమా అందర్నీ మెప్పిండం ఆనందంగా ఉంది. హేషమ్‌ వండర్‌ఫుల్‌ మ్యూజిక్‌, బీజీఎం ఇచ్చారు. వీటిపై ఆడియెన్స్‌ పాజిటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు’ అని అన్నారు.