30 ద్విచక్ర వాహనాల స్వాదినం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
కల్మేశ్వర్ సింగేవార్ కమిషనర్ ఆఫ్ పోలీస్, నిజామాబాద్ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఎసిపి ఎల్. రాజా వెంకట రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి టి. నారాయణ, డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్ లో పర్యవేక్షణలో గురువారం సాయంత్రం డిచ్ పల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనీఖీలకు మెటర్ వేహికల్ ఇన్స్పెక్టర్లు ఈ రాహుల్ కుమార్,ఎం కిరణ్ కుమార్, డిచ్ పల్లి ఎస్సై యు మహేష్ లు రాహదరి వేంట వచ్చి పోయే వాహనాలకు సంబంధించిన పత్రలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నంబర్ ప్లేట్లు లేని వానాలకు సంబంధించిన పత్రాలు లేని వాహనాలను పట్టుకున పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు సంబంధించిన పార్టీ నిబంధనలను కచ్చితంగా పాటించాలని నంబర్ ప్లేట్లు లేని వాహనాన్ని నడపొద్దన్నారు. మద్యం సేవించి సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనం నడిపి లేని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలు చాలా 12 గంటల పాటు చేపట్టారు.