నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో ఎల్ ఆర్ ఎస్ కోసం 2020 సంవత్సరంలో నిర్దేశిత ఫీజు చెల్లించిన ప్లాట్ల యజమానులకు ప్లాట్ల రెగ్యులరైజ్ కోసం ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు నుడా చైర్మన్ కేశ వేణు శనివారం తెలిపారు. మొత్తం 4511 మంది ప్లాట్ల యజమానులకు ఈ అవకాశం ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.