
జనవరి1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని,త్వరలో పంచాయతీ,మండల,జిల్లా పరిషత్,పురపాలక తో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు అవకాశం కల్పించిందని తాహసీల్దార్ యాదగిరి రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఈనెల 20,21 తేదీలలో సంబంధిత బూత్ లెవల్ అధికారులు పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఓటరు జాబితాలో చిరునామా తదితర సవరణల గురించి మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.శనివారం, ఆదివారం రోజులలో ఓటర్ నమోదు పై ప్రత్యేక స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.