– తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్
– సద్వినియోగం చేసుకుంటే ప్రయోజనం
– నేడు తాడిచెర్ల పోస్టాపిస్ లో ప్రత్యేక మేళా
– అర్హులైన వారు రావాలని బిపిఎం పిలుపు
నవతెలంగాణ మల్హర్ రావు: అనుకోని ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే వారిపై ఆధారపడిన కుటుంబాల పరిస్థితి దయనీయం.భార్య/భర్త మరణిస్తే వారి పిల్లల చదువులు,ఇతర అవసరాల కోసం ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి.అందుకే ఇటీవలి కాలంలో ప్రమాద బిమాపై చాలామందిలో అవగాహన పెరిగింది.ఈ క్రమంలో తపాలా శాఖ తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ ప్రయోజనం చేకూరేలా ప్రమాద బీమా పథకాలను అందుబాటులోకి తెచ్చింది.రూ.10 లక్షల నుంచి రూ 15 లక్షల ప్రయోజనంతో హెల్త్ ప్లేస్, ఎక్స్ ప్రెస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములను ప్రవేశపెట్టింది.వీటిని సద్వినియోగం చేసుకుంటే తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తకుండా చూడొచ్చు.
రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల బీమా….
నివా హెల్త్ ఇన్స్ రెన్స్ తపాలా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తక్కువ ప్రీమియంతో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ప్రమాద బీమా అందిస్తోంది.18 నుంచి 65 ఏళ్ళ లోపు వారు ఈ పథకానికి అర్హులు.ఏడాదికి ఒకేసారి రూ.555 ప్రీమియంతో రూ.10 లక్షలు, రూ.755 ప్రీమియంతో రూ.15 లక్షల ప్రయోజనం పొందవచ్చు.పాలసీదారు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భాల్లో మాత్రమే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు బీమా ప్రయోజనం అందుతోంది.
మరెన్నో ప్రయోజనాలు…
తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న హెల్త్ ప్లేస్, ఎక్స్ ప్రెస్ ఇన్స్ రెన్స్ స్కీములతో ప్రమాదవశాత్తు మరణించిన, ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం కలిగిన కాలు/చేయి కోల్పోయిన, పక్షవాతం సంబంధించిన బీమా మొత్తం చెల్లిస్తారు.అలాగే పాలసీదారు పిల్లలు చదువుకుంటూ ఉంటే అదనంగా రూ.50 వేలు/రూ.లక్ష వరకు ప్రయోజనం. ప్రమాదంలో గాయాలతో ఆసుపత్రిలో చేరితే వైద్య ఖర్చులకు రూ.లక్ష వరకు చెల్లిస్తారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రోజుకు రూ.500/1000 వరకు, ఐసియూలో ఉంటే రూ.1000/2000 వేల వరకు అందిస్తారు. పాలసీదారు చనిపోతే అంత్యక్రియల ఖర్చులకు రూ.5 వేలు ఆర్థిక సహాయం పొందవచ్చు.ప్రమాదంలో ఎముకలు విరిగితే రూ.25 వేల వరకు పొందవచ్చు.పాలసీ గడువు కాలంలో ఒకసారి ఆరోగ్య తనిఖీ, అపరిమిత టేలి కన్సల్టెన్సీ ప్రయోజనాలు పొందవచ్చు.
సద్వినియోగం చేసుకోవాలి: సమ్రిన్ తాడిచెర్ల బిపిఎం
నివా హెల్త్ ఇన్స్ రెన్స్, పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో హెల్త్ ప్లేస్, ఎక్స్ ప్రెస్ హెల్త్ ఇన్స్ రెన్స్ స్కిములు అందుబాటులో ఉన్నాయి.ప్రీమియం ప్రారంభించిన 15 రోజుల తరువాత నుంచి బీమా వర్తిస్తోంది.పాలసీదారు మరణిస్తే చెందితే ఏప్ఐఆర్ కాపీ,ఇతర ధ్రువ పత్రాలతో క్లైం చేసుకున్న నెల రోజుల్లో బీమా ప్రయోజనాలు అందుతాయి.అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి.