జుక్కల్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 706 కు చేరిక 

నవతెలంగాణ – మద్నూర్ 
జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును ఎన్నికల సిబ్బంది వినియోగించుకుంటున్నారు. మంగళవారం నాటికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 706 కు చేరినట్లు ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి డి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. మద్నూర్ తహసిల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ హక్కును వినియోగించుకుంటున్న ఎన్నికల సిబ్బంది.