– ఉల్లంఘనపై క్రమశిక్షణా చర్యలు తప్పవు
– కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రావ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కాన్ఫరెన్స్హాల్లో పోస్టల్ బ్యాలెట్ విధివిధానాలపై నియమించిన నాలుగు నియోజక హోం ఓటింగ్ బృందాలతో నిర్వహించిన సమావేశం లో సాధారణ పరిశీలకులు డా. కౌశిగన్, బాలకిషన్ ముండా, ఆదనవు కలెక్టర్ సి.హెచ్. ప్రియాంకలతో కలిసి మాట్లాడారు.కేంద్ర ఎన్నికల సంఘం వద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయం కల్పించిందని తెలిపారు.జిల్లాలో సూర్యాపేటకు 5, కోదాడ 10, తుంగతుర్తి 7, హుజూర్నగర్ 13 మొత్తం 35 బందాలను నియమించామని తెలిపారు.ఓటర్లందరికి ముందస్తుగా బీఎల్ఓల ద్వారా అలాగే సెల్ఫోన్ ద్వారా తప్పక సమాచారం అందించాలని సూచించారు. ఓటరు ఇంటికి మొదటిసారి వెళ్ళినప్పుడు లేకపోతే మరోసారి వెళ్లాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలలో వాస్తవ ఓటింగ్ ఎలా జరుగుతుందో ఓటర్ ఇంటి వద్దకూడా అలాగే చేపట్టాలని సూచించారు. జిల్లాలో 1008 మంది ఓటర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక కషి చేయాలని సూచించారు. కమిటీలో పీఓ,ఏపీఓ,వీడియోగ్రాఫర్, మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ఏజెంట్ అలాగే బందోబస్తుకు పోలీసులు ఉంటారని తెలిపారు.కోదాడ, హుజూర్నగర్ నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు డా. కౌశిగన్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం 80 ఏండ్లు దాటిన వద్ధులు అలాగే వికలాంగులకు కల్పించిన సదుపాయం తప్పక వినియోగించుకోవాలని కమిటీకి పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు.సూర్యాపేట, తుంగతుర్తి నియోజక వర్గాల సాధారణ పరిశీలకులు బాలకిషన్ ముండా మాట్లాడుతూ 12డి ద్వారా అందిన ప్రతి ఓటర్ దరఖాస్తు పరిగణలోకి తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో ఆయా నియోజక వర్గాల తహసీల్దార్లు, కమిటీ బృందాలు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.