ప్రజలకు మరింత చేరువలో పోస్టల్ శాఖ

– ఆళ్ళపల్లిలో నూతన సబ్ పోస్ట్ ఆఫీస్ ప్రారంభం 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
పోస్టల్ శాఖ ద్వారా ప్రజలకు మరింత చేరువలో వివిధ రకాలసేవలు అందుబాటులో వచ్చాయని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్సూపరింటెండెంట్ రవి కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఆళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనహొ507126 పిన్ కోడ్ తో సబ్ పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సబ్ పోస్ట్ ఆఫీసు పరిధిలో 12 బ్రాంచి పోస్ట్ ఆఫీస్ లు ఉంటాయని చెప్పారు.అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్,పొదుపు సౌకర్యాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన టీఎఎంఆజాద్ కా అమృత్ మహోత్సవంలోకోరారు. అందులో భాగంగాహొ భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా జాతీయజెండాలను ప్రతీ పోస్ట్ ఆఫీస్ లో విక్రయించడం జరుగుతుంది తెలిపారు. దానికి గాను కేవలం రూ.25/- చెల్లించి ఆన్లైన్ లో చెల్లించి బుక్ చేసుకోవచ్చు లేదా ప్రత్యక్షంగా కొనడం చేసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని తప్పక ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ శాఖ అధికారులు వి.సూర్యదేవ్, గౌరవ్ శుక్ల, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ జె.బాలాజీ, ఆళ్ళపల్లి మండల పోస్టల్ సిబ్బంది అనుమోల వెంకటేశ్వర్ రావు, సయ్యద్ సర్వర్, మోహన్, పీఎసీఎస్ డైరెక్టర్ సయ్యద్ హఫీజ్, బీఆర్ఎస్ నాయకులు గౌరబోయిన సుబ్బారావు దొర, ప్రముఖ వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాసరావు, మొహమ్మద్ నయీమ్, సయ్యద్ సత్తార్, సాబీర్, తదితరులు పాల్గొన్నారు.