
ఇటీవల మండల పరిధిలోని ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన మెంచు లింగయ్య, పిల్లలమర్రి రాములమ్మ ల కుటుంబ సభ్యులకు తపాల బీమా నగదును సర్పంచ్ గుర్రం సత్యనారాయణ శనివారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ బీమా కడుతూ మృతి చెందిన వారికి క్లైమ్ చేసి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇస్తూ గ్రామ పోస్ట్ ఆఫీస్ తరపున మెంచు లింగయ్య కుటుంబానికి 1,21,000.లు, పిల్లలమర్రి రాములమ్మ కుటుంబానికి 72000.లు మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రవేట్ సంస్థలను నమ్మి మోసపోకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పోస్టల్ శాఖలో భీమా చెల్లించాలని లబ్ది పొందాలని సూచించారు .ఈ కార్యక్రమంలో తపాలా కార్యాలయ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మారపంగా అశోక్ , తపాలా సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.