దుబ్బాక మండలం హబ్షిపూర్ గ్రామానికి చెందిన అబ్బుల చంద్రకళ ఇటీవల గుండె పోటుతో మృతి చెందింది.ఐతే ఆమె గ్రామీణ తపాలా జీవిత భీమా కలిగి ఉండడంతో రూ.2,07,700 ప్రమాద భీమా చెక్కును మెదక్ నార్త్ సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ వల్లంచెట్ల రాహుల్ ఆమె భర్త అబ్బుల యాదయ్య కు బుధవారం అందచేశారు.ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఒక మనిషి లేని లోటు ఆ కుటుంబానికి ఎవ్వరూ తీర్చలేనిది .అయితే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేది జీవిత భీమా ఒక్కటే, అందుకే భీమా చెయ్యండి ధీమాగా ఉండండి అని తెలిపారు.పోస్ట్ ఆఫీస్లో అందించేటువంటి తపాలా జీవిత భీమా, ప్రజలకు తక్కువ ప్రీమియం తో ఎక్కువ బోనస్ ను అందిస్తూ బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చింత శ్రవణ్ కుమార్ , సబ్ పోస్ట్ మాస్టర్ , నాయక్, పోస్ట్ మాస్టర్, హబ్శిపూర్ గ్రామ ప్రజలు మరియు తపాలా కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.