రూ.16 నొక్కేస్తున్నామని ఒప్పుకున్న పోస్టల్ అధికారులు

The postal officials admitted that they are pressing Rs.16నవతెలంగాణ – గోవిందరావుపేట 
పెన్షన్ దారుల రూ.16 నొక్కేస్తున్నామని పోస్టల్ అధికారులు పోలీసుల ముందే అంగీకరించారు. బుధవారం మండలంలోని పసర పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో పెన్షన్ దారులు తమకు పై రూ.16 సంవత్సర కాలంగా ఇవ్వడం లేదని పాత్రికేయులకు పోలీసులకు తమ ఇబ్బందులను పెన్షన్ దారులు వివరించారు. ఒక దశలో 163వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తామని పేర్కొనడంతో స్థానిక పోలీసులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ దశలో పోలీసులు అటు అధికారులను ఎటు పెన్షన్ దారులను పూర్తిస్థాయిలో విచారించి అడిగి వివరాలను రాబట్టారు. గత సంవత్సర కాలంగా పై 16 ఇవ్వడం లేదని పెన్షన్ దారులు మూడు నెలలుగా ఇవ్వడం లేదని పోస్టల్ అధికారులు పోలీసులకు వివరించారు. పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో ఒక్కొక్కరికి రూ.100 చొప్పున చెల్లిస్తామని పోస్ట్మాస్టర్ శ్రీనివాస్ ముందు గతంలో పెన్షన్లు పంపిణీ చేసిన అధికారులు అంగీకరించారు. పోస్ట్మాస్టర్ శ్రీనివాసు ఈ విషయంతో తనకు సంబంధం లేదని తెలపడంతో పెన్షన్ దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క టేబుల్ లో తక్కువ పైసలిస్తుంటే ప్రశ్నించకపోవడం ఏంటని వారు అన్నారు. ప్రధాన పోస్టుమాస్టర్ తో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు ప్రతినెల పై రూ.16 వసూలు ధనాన్ని వాటాలుగా పంచుకుంటున్నారని అన్నారు. ప్రశ్నించిన పెన్షన్ దారులను వేలిముద్రలు పడటం లేదంటూ సిగ్నల్ లేదంటూ రోజుల తరబడి తిప్పించుకుంటూ ఇబ్బందులకు గురి చేయడం వల్ల రూ.16 పోతే పోనీ అని ప్రతి ఒక్కరు సర్దుకుపోతున్నారని అన్నారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రంలోని పోస్టల్ కార్యాలయం అధికారులు పెన్సిల్ సక్రమంగా పంపిణీ చేస్తుంటే పసర అధికారులు మాత్రం కక్కుర్తి పడి రూ.16 నొక్కేస్తున్నారని పెన్షన్ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము చిల్లర తెచ్చుకుంటామన్నా కూడా అధికారులు అంగీకరించకుండా డబ్బులు తినడానికి అలవాటు పడి రూ.16 రూపాయలను కాజేస్తూ వాటాలుగా పంచుకుంటున్నారని అన్నారు. అధికారులను విచారించిన పోలీసులు కేసు నమోదు చేయాలని తెలిసిందారులు కోరారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు తలెత్తవని పోస్ట్ ఆఫీస్ గోడపై పోలీసు కార్యాలయం నెంబర్లు వేయిస్తామని అన్యాయం జరిగితే నెంబర్కు ఫోన్ చేసి చెప్పాలని వెంటనే పరిష్కరిస్తామని పోలీసులు సూచించారు. పెన్షన్ సొమ్ము పూర్తిగా ప్రతి పెన్షన్ దారులకు చెల్లించాలని తాము కోరుకున్నట్లు పెన్షన్ దారులు పోలీసులను కోరారు. లింగాల బంధాల వడ్డిగూడెం బుల్లెపల్లి అల్లిగూడెం గ్రామాల నుండి పెన్షన్ల కొరకు వస్తూ ఇబ్బందులకు గురవుతున్నామని తమ గ్రామాలను సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ తీసుకోవడం జరుగుతుందని ఇక్కడేమో రూ.16 ఇవ్వకుండా దోపిడీ చేస్తున్నారని చూడాలని పోలీసులను కోరారు.