వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అక్టోబర్ 25,26, 27 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్ ను డిఆర్డిఎ పిడి టీ నాగిరెడ్డి, శ్రీ సంక్షేమ శాఖ పీడి నరసింహ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అక్టోబర్ 25 26. 27 తేదీల్లో జరిగే రాష్ట్ర మహాసభల కరపత్రం విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 25. 26. 27 తేదీల్లో హైదరాబాద్ లో జరిగే ఎన్ పి ఆర్ డి 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి మాట్లాడుతూ వికలాంగులను చైతన్య పర్చడం కోసం ఎన్ పి ఆర్ డి చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. అనంతరం ఎన్ పి ఆర్ డి రాష్ట్ర సహాయ కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం 2011 నుండి ఇప్పటివరకు వికలాంగులకు రూ.300 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇవ్వడం వికలాంగుల పట్ల వారికి ఉన్న చిత్త శుద్ధి అర్థమవుతుందని వారు అన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస పెన్షన్ ను దేశవ్యాప్తంగా రూ.3000 రూపాయలకు పెంచాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. అక్టోబర్ 25 తారీఖున ఇందిరాపార్క్ వద్ద ఎన్ పి ఆర్ డి రాష్ట్ర బహిరంగ సభకు జిల్లా మండల గ్రామాల నుండి పెద్ద సంఖ్యల హాజరై పాల్గొని జయప్రదం చేయాలని జిల్లాలోని వికలాంగులను కోరారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు సురూపంగా ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ముందు వికలాంగులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను రూ.6000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చెయ్యడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పరిరక్షణ చట్టాన్ని అమలు చెయ్యాలని, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళ వికలాంగులపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టి శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొత్త లలిత, మండల నాయకులు శ్రీహరి లు పాల్గొన్నారు.