ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ..

నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ అర్బన్ ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాగులు ప్రశాంత్  ఆధ్వర్యంలో మంగళవారం ఫోటో ట్రేడ్ ఎక్స్ పో కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ వేములవాడలోని సినారె కళామందిర్ లో ఈనెల జూలై 26,27,28 తేదీల్లో జరిగే తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  ట్రేడ్ ఎక్స్ పో  కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ ల కోసం రాష్ట్ర అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ఫోటో ట్రేడ్ ఎక్స్ పోలో మన ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జింక శ్రీధర్, అనిల్, నరేష్, శ్రీను, పరశురాం, సునీల్, నరేష్, సుమన్, రాము, సాయి తో పాటు తగితాలు పాల్గొన్నారు.