నవతెలంగాణ – కంఠేశ్వర్
సామజిక మధ్యామల ద్వారా ఎమ్మెల్సి కవితక్క మార్ఫింగ్ ఫోటోలను అరవింద్దర్మపురి ఆర్మీ అనే ఐడి తో పోస్ట్ పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే సామజిక మధ్యమాల నుండి ఆ పోస్టులను తొలగించాలని కోరుతూ నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ మంగళవారం ఇంచార్జి కమిషనర్ అఫ్ పోలీస్ సింధు శర్మ ని కలిసి పిర్యాదు చేశారు. ఈ సందర్బంగా మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ.. ఎంపీ అరవింద్ ధర్మపురి అనుచరులు విచ్చాలవిడిగా కనీసం మహిళల ప్రజా ప్రతినిధి అనే గౌరవం లేకుండా మార్ఫింగ్ ఫోటో తో కించపరచటం సిగ్గు చేటని అన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ తో కలిసి బి. ఆర్. యస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ కార్పొరేటర్ విశాలిని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.