నూతనంగా రిక్రూట్ అయిన ఎ.ఆర్, సివిల్ కానిస్టేబుళ్లకు పోస్టింగ్స్ 

Postings for newly recruited AR and Civil Constables– ఉత్తర్వులు జారీ చేసిన ఇంచార్జీ పోలీస్ కమీషనర్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
పోలీస్ పరేడు గ్రౌండ్ యందు నిజామాబాద్ పోలీస్ విభాగంలో నూతనంగా రిక్రూట్ అయిన 344 మంది ఎ.ఆర్, సివిల్ కానిస్టేబుళ్లకు (పురుషులు / మహిళలు) ఎవ్వరి విభాగంలో వారికి పోస్టింగ్స్ ఇస్తూ నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి. హెచ్. సింధూశర్మ, ఐ.పి.యస్ శనివారం ఉత్తర్వులను జారీ చేశారు.సివిల్ విభాగంలో మొత్తం 218 కి గాను పురుషులు 150 మంది మహిళలు 68 మంది ఉన్నారు.ఎ.ఆర్ విభాగంలో మొత్తం 126 కి గాను పురుషులు 87 మంది, మహిళలు 39 మంది ఉన్నారని తెలిపారు.ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) కోటేశ్వర రావు మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బంది శిక్షణ కాలంలో నేర్చుకున్న నూతన పద్ధతులను మీ సర్వీసు మొత్తం పనికి వస్తాయని, ప్రతీ ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలని, ప్రతీ ఒక్కరు తమ పై అధికారి సూచనలను తూ.చ తప్పకుండా పాటించాలని ఏ విషయం అయినను తమ పై అధికారికి తెలియజేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఎ.ఆర్ ఎ.సి.పి నాగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీశైలం రిజర్వు ఇన్స్పెక్టర్స్ సతీష్, శ్రీనివాస్, తిరుపతి, ఆఫీస్ సూపరింటెండెంటులు శ్రీ శంకర్, బషీర్ మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.