నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో భాగంగా వచ్చేనెల 12న నిర్వహించే పరీక్షను 21కి వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చేనెల 13 నుంచి 21వ తేదీ వరకు ఆ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.