డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు వాయిదా

– జూన్‌ 12 నుంచి 20 వరకు తిరిగి నిర్వహణ : టీఎస్‌పీఎస్సీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి ఈ నవీన్‌ నికోలస్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 13, 14 తేదీల్లో డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈనెల 13న పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ ఉండడంతో డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నామని తెలిపారు. జూన్‌ 12 నుంచి 20వ తేదీ వరకు ఆ పరీక్షలను తిరిగి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.