వారంతపు సంత వేలం వాయిదా..

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే పశువుల,కూరగాయల వారసంత 2024-25 ఏడాది నిర్వహణకు  గ్రామ పంచాయతీ కార్యాలయ అవరణం వద్ద  ఎంపీడీఓ లక్ష్మప్ప,ఎంపీఓ విష్ణు వర్ధన్ సమక్షంలో శుక్రవారం వేలం నిర్వహించారు. వేలంలో నిర్ణీత ధరకు తక్కువ పలకడంతో నేటికి వాయిదా వేసామని తిరిగి యథావిధిగా నేడు వేలం నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ తెలిపారు. పంచాయితీ కార్యదర్శి ప్రణిత్ రెడ్డి,కారోభార్ బోనగిరి లక్ష్మన్, గ్రామ పంచాయతీ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.