సీపీఐ(ఎం) పార్టీ తుర్కపల్లి మండల ఎనిమిదవ మహాసభలో మండల నూతన కమిటీ 9 మందితో నూతన కార్యదర్శిగా మూడవసారి పోతరాజు జహంగీర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం శుక్రవారం విలేకరులకు తెలిపారు. అనంతరం నూతన మండల కార్యదర్శిగా ఎన్నికైన పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ.. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ప్రజలతో చర్చించి ఉద్యమాలు నిర్వహించడంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజా సంఘాలను బలోపేతం చేసి, ప్రజా పునాది పెంచుకుంటామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన గ్రామా సభలు నిర్వహించి, ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజల్లో ఉంటూ ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వ హామీల అమలుకై ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. నూతన మండల కమిటీ సభ్యులుగా కొక్కొండ లింగయ్య, గడ్డమీది నరసింహ, తలారి మాతయ్య ,తూటి వెంకటేశం, ఆవుల కలమ్మ ,దార్ల దుర్గయ్య ,కడియాల నాగులు ,గుండెబోయిన వెంకటేశం లను ,ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.