నవతెలంగాణ – తుర్కపల్లి
సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని శుక్రవారం అన్ని గ్రామ పంచాయితీలలో ఉన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని తాసిల్దార్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ..తుర్కపల్లి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలో ఉన్న స్థానిక సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, మండల కేంద్రంలోని నిర్మించిన డబల్ బెడ్ రూములు ఇండ్లకు నాలుగు లైన్ల మోరీలు ఉన్నవి వీటిని ఇండ్ల చివరి వరకు నిర్మించక మధ్యలోనే వదిలేయడం వల్ల నాన్న ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని లేనియెడల సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ సభ్యులు గడ్డమీది నరసింహ,తూటి వెంకటేశం, సిల్వర్ పెంటయ్య, ఆవుల కలమ్మ, కోట నాగరాజు, లక్ష్మయ్య ,స్వామి, ఎల్లోజ్ వెంకటేశం, శ్రీహరి, ఆకుల భాస్కర్, రాజు, కడయ్య,తదితరులు పాల్గొన్నారు.