చదువు విలువ తెలిపే పొట్టేల్‌

Potel that shows the value of educationయువ చంద్ర కష్ణ, అనన్య నాగళ్ల లీడ్‌ రోల్స్‌లో సాహిత్‌ మోత్కూరి డైరెక్ట్‌ చేస్తున్న రూరల్‌ యాక్షన్‌ డ్రామా ‘పొట్టేల్‌’. ఈ చిత్రంలో అజరు పవర్‌ ఫుల్‌ రోల్‌ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌ టైన్‌మెంట్స్‌పై నిశాంక్‌ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్‌ కుమార్‌ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఈ సినిమా ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్యఅతిథిగా డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా హాజరయ్యారు. హీరో యువ చంద్ర మాట్లాడుతూ, ‘మైత్రి మూవీ వారు ఈ సినిమాని రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ ప్రాపర్‌ థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మూవీ. ఇందులో ఎమోషన్‌ ఆడియన్స్‌ మనసుల్ని కదిలించేలా ఉంటుంది’ అని చెప్పారు. ‘ఈ కథ విన్నాను. తర్వాత సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. రెండు పాటలు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్‌ కూడా చాలా బాగుంది. అజరు సినిమా అంతా భయపెట్టించి వదిలారు. యువ, అనన్య, నోయల్‌, జీవ సూపర్‌గా యాక్టింగ్‌ చేశారు. సాహిత్‌ ఇంత అద్భుతంగా తీస్తాడని ఊహించలేదు. ప్రొడ్యూసర్స్‌ చాలా ప్యాషన్‌తో సినిమా తీశారు. సినిమా మీ అందరికీ నచ్చుతుంది. న్యూ కైండ్‌ ఆఫ్‌ ట్రీట్‌మెంట్‌. ఈ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తర్వాత నేను చూసిన సినిమా ఇదే. అందర్నీ ఆలోచింపజేస్తుంది’ అని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా అన్నారు.