బీజేపీ నాయకుడు కిషన్ రావు ఆగడాలను అరికట్టాలి: పోతంగల్ గ్రామస్తులు

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండలంలోని చిన్న పోతంగల్ గ్రామస్తులు గ్రామపంచాయతీ చెందిన 14 గుంట భూమిని గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పోతంగల్ కిషన్ రావు అనే వ్యక్తి అక్రమంగా భూమి పట్టా చేయించుకున్నారని ఆరోపిస్తూ చిన్న పోతంగల్ గ్రామస్తులు సుమారు 500 మంది వరకు కామారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. అధికారులు న్యాయం చేసే వరకు రాస్తారోకో విరమించబోమని గ్రామస్తులు బీచ్ ను రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు పేరుకుపోయాయి పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఆర్ఐ రమేష్ వచ్చి మీకు న్యాయం చేస్తామని రోడ్డుపై నిరసన చేయడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని చెప్పడంతో ప్రజలు రాస్తారోకో విరమించి తహసీల్దార్ కార్యాలయం తరలి తహసీల్దార్ జానాకి వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తాసిల్దార్ న్యాయం చేస్తా అని మాట ఇవ్వడంతో రాస్తారోకో విరమించామని ఎనిమిది రోజుల్లోగా మా గ్రామానికి న్యాయం చేయకపోతే మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. పోతంగల్ కిషన్ రావు గ్రామంలో గ్రామ పంచాయతీ స్థలమే కాకుండా వేరే ఇతర స్థలాలు కూడా అనేకంగా ఆక్రమించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 1987లో గ్రామంలోని గ్రామస్తులందరూ డబ్బులు జమచేసి 200 A సర్వేనెంబర్ లో ఏడు గుంటలు 200 Bసర్వేనెంబర్ లో ఏడు గుంటలు కొనుగోలు చేశారని అలాగే అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మించామ,ని కమ్యూనిటీ హాల్ శిధిలావస్థకు చేరడంతో దాని స్థానంలో గ్రామ పంచాయతీ నిర్మిస్తామని తలపెట్టడంతో ఈ స్థలం నాది అని నా పేరు పై పట్టా ఉందని కిషన్ రావు ప్రతి విషయానికి అడ్డుపడుతున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు గ్రామపంచాయతీ నిర్మాణాన్ని స్లాబ్ లెవెల్ వరకు నిర్మించారు కానీ బీజేపీ నాయకుడు కిషన్ రావు ప్రతి విషయంలో అడ్డుపడుతూ ఈ విషయంలో ఎవరైనా తరచూస్తే వారి అంతు చూస్తారని బెదిరిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మా గ్రామానికి న్యాయం చేయాలని బీజేపీ నాయకుడు కిషన్ రావు పైకఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.