మట్టి రోడ్డులో గుంతలు పూడ్చివేత 

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట శుక్రవారం, మాసాయిపేట నుండి తాళ్లగూడెం, పెద్దకందుకూరు వెళ్లే మట్టి రోడ్డులో గుంతలను మాజీ వార్డ్ మెంబర్ కళ్లెం విజయ జహంగీర్ గౌడ్ సొంత నిధులతో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పాండవుల సత్య ప్రకాష్ ఆధ్వర్యంలో పూడ్చివేత  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎం డి నసీరుద్దీన్, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎం డి యాకూబ్, ఎం డి ఉస్మాన్, వాకిటి కృష్ణ /రామ్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.