పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలి

Potti Sriramulu should continue the nameనవతెలంగాణ – చండూరు 
తెలుగు విశ్వవిద్యాలయంకు పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయంలో పేరు మార్పునకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఇచ్చిన పిలుపుమేరకు చండూరు మండల ఆర్యవైశ్యులు బుధవారం నల్గొండ అదనపు   కలెక్టర్ పూర్ణ చందార్రావు  కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘము నూతన అధ్యక్షులు  తేలుకుంట్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ఏ రాష్ట్రానికి ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని దేశం గర్వించదగ్గ నాయకుడని భాష ప్రయుక్తరాష్ట్రాలకు ఆధ్యుడు స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని మహాత్మా గాంధీ ప్రశంసలందుకున్న గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా మాజీ అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు,మిర్యాలగూడ మునిసిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, కార్యదర్శి యామా దయాకర్, సముద్రాల వెంకటేశ్వర్లు, వార్డ్ కౌన్సిలర్ మంచుకొండ కీర్తి సంజయ్,సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు సోమా నర్సింహా మాజీ అధ్యక్షులు జవహర్ బాబు, పట్టణ అధ్యక్షులు కర్నాటి శ్రీనివాస్ సంతోష్ రాజశేఖర్, తాడిశెట్టి వెంకన్న,  తడక మల్ల శ్రీధర్,  సాగర్ ,జగ్గయ్య, మహిళా జిల్లా అధ్యక్షులు పందిరి గీత, నల్గొండ  కౌన్సిలర్ యామ కవిత గీత పాల్గొన్నారు.