డాక్టర్ కావాలనే కళకు అడ్డుగా మారిన పేదరికం..

Poverty became an obstacle to the art of becoming a doctor.– దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండల కేంద్రానికి చెందిన ఎస్సీ నేతకాని నిరుపేద కుటుంబానికి చెందిన గంట లక్ష్మి-వెంకటస్వామి దంపతుల కుమార్తె గంట జ్యోత్స్న ఎంబిబిఎస్ లో సీటు సాధించి ఖమ్మం జిల్లాలోని మమత మెడికల్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతుంది. ఆమె తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి కొద్దిపాటి భూమిని కూతురు చదువు నిమిత్తం అమ్ముకొని గత మూడు సంవత్సరాలు విద్య కోసం ఖర్చు చేయడం జరిగింది. ప్రస్తుతం జోత్స్న వాళ్ళ నాన్న బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నారు. అమ్మ కూలీనాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. డాక్టర్ కావాలంటే ఇంకా రెండు సంవత్సరాల చదువు చదవాల్సి ఉంది. కానీ ఆ చదువుకు అయ్యే ఖర్చులను ఆ కుటుంబం భరించే స్థితిలో లేదు. కనుక నిరుపేద కుటుంబానికి చెందిన గంట జ్యోత్స్న ఎంబిబిఎస్ చదువు  అర్ధాంతంగా ఆగిపోతుందని, డాక్టర్ కావాలని కోరిక నెరవేరలేకపోతుందని ఎంతో ఆవేదన చెందుతుంది. ఊహించని ఖర్చులు ఏర్పడడంతో ఎటు కాని వారం అయ్యామని ఆ విద్యార్థి ఆందోళన చెందుతుంది. ఫీజులు కట్టకపోవడంతో కళాశాల యాజమాన్యం హాల్ టికెట్ కూడా ఇవ్వడం లేదని, తన ఆవేదనను వ్యక్తం చేస్తుంది. తాను డాక్టర్ అయ్యాక  సమాజానికి సేవ చేస్తానని తెలియజేస్తోంది. దయనియులైన దాతలు ముందుకు వచ్చి నిరుపేద నేతకాని సామాజిక వర్గానికి చెందిన గంట జ్యోత్స్న విద్యాభివృద్ధి కొరకు ఆర్థిక సహాయం చేయగలరని వారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సహకరించు  దాతలు 9502678743 నర్మబర్ కు ఫోన్ పే,గుగల్ పే చేయాలని విజ్ఞప్తి చేశారు.