రేపు పలు మండలాలకు విద్యుత్ అంతరాయం 

Tomorrow there will be power outage in many mandals across the district– ములుగు డివిజనల్ ఇంజనీర్ పులుసం నాగేశ్వరరావు 
నవతెలంగాణ – తాడ్వాయి 
రేపు శనివారం ములుగు జిల్లా వ్యాప్తంగా తాత్కాలికంగా మరమతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని, ములుగు జిల్లా (ఎంపీడీసీఎల్, డీఈ) డివిజనల్ ఇంజనీర్ పులుసుం నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 33/11 కె.వి ఉప కేంద్రాలలో మరమ్మతుల కారణంగా రేపు అనగా శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ములుగు జిల్లాలోని కాసిందేవిపేట, అబ్బాపూర్, పందికుంట, వెంకటాపూర్, మల్లంపల్లి, లక్ష్మీదేవి పేట, పస్రా, కాటాపూర్, మేడారం, వాజేడు, వెంకటాపురం సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఆయన అన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.