నేడు రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో విద్యుత్ అంతరాయం

నవ తెలంగాణ- రాయపోల్
రాయపోల్, దౌల్తాబాద్ మండలాల వ్యాప్తంగా మంగళవారం విద్యుత్ అంతరాయం కలుగుతుందని ప్రజలు సహకరించాలని విద్యుత్ శాఖ ఏడిఈ శ్రీనివాసరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 132 కేవీ దౌల్తాబాద్ సబ్‌స్టేషన్ నిర్వహణలో బాగంగా 33కేవీ దౌల్తాబాద్, ముబారస్ పూర్, గుర్రాలసోఫా, రాయపోల్, ఫీడర్ మరమ్మతులలో భాగంగా 33/11 కేవీ దొమ్మాట,జప్తిలింగారెడ్డి పల్లి, గోవిందాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో గల 11 కేవీ ఫీడర్లు మంగళ వారం ఉదయం 08:00 గంటల నుంచి మద్యాహ్నం 12:00 గంటల, వరకు ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ ఫీడర్ పరిధిలోగల దొమ్మట, దౌల్తాబాద్, రాయపోల్, అనాజీపూర్, గురాలసోఫా, వడ్డేపల్లి, రామారం, రాంసాగర్, వీర్‌నగర్, పోతన్ పల్లి, కోనాపూర్, గోవిందాపూర్, సూరంపల్లి, ముత్యంపేట, గాజులపల్లి, ఉప్పర్‌పల్లి, గువ్వలేగి గ్రామాలలో  అన్ని వ్యవసాయ,ఇండస్ట్రియల్, విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ నిలిపి వేయబడును కావున ప్రజలు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించగలరని ఆయన పేర్కొన్నారు.