– రూ 12 లక్షలు ఆస్తి నష్టం
– పొంతన లేని సమాచారం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల పరిధిలోని వినాయకపురంలో గల లక్ష్మిసాయిరామ రైస్మిల్ లో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ ఘాతం కారణంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. మిల్ యజమాని నాగేశ్వరరావు తెలిపిన వివరాలు ప్రకారం..అగ్నిమాపక అధికారి తెలిపిన సమాచారం మేరకు 8 వేలు బస్తాలు ధాన్యం అగ్నికి ఆహుతి అయినట్లు, దీని నష్టం అంచనా సుమారు రూ.12 లక్షలు ఉంటుందని తెలిపారు. మిల్ యజమాని నాగేశ్వరరావు మాత్రం ధాన్యం ఏమి నష్టం పోలేదని, కాలీ సంచులు మాత్రమే కాలిపోయాయి, వాటి విలువ సుమారు రూ.50 వేలు ఉండొచ్చు అని అన్నారు. ఇదే విషయమై తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ ను వివరణ కోరగా.. నష్టం అంచనా వేయడానికి సివిల్ సప్లై జిల్లా అధికారులు వస్తారని తెలిపారు.