రేపు విద్యుత్ అంతరాయం..

– ఎన్పీడీసీఎల్ ఏఈ వేణు కుమార్
నవతెలంగాణ – తాడ్వాయి 
మండల పరిదిలో గల 33కే.వి. కాటపూర్ ఫీడర్ మరియు కాటపుర్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా రేపు అనగా తేది.18.05.2024 (శనివారం) ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 2 గంటల వరకు, విద్యుత్ అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ, ఎన్పీడీసీఎల్ ఏఈ వేణు కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మరమ్మతుల వలన కాటపూర్, దామెరవాయి, పంబపూర్, గంగారాం, నర్సాపూర్, బీరేల్లీ, అంకంపల్లి, రంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల గ్రామాలకు అంతరాయం కల్గును, కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.