స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

Power should be exercised in local elections– ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ చల్లా వంశీచంద్‌ రెడ్డి
– కడ్తాల్‌ లో స్థానిక నాయకులతో సమావేశం
నవతెలంగాణ-ఆమనగల్‌
రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్‌ చల్లా వంశీచంద్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కడ్తాల్‌ మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో ఆయన కొద్దిసేపు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని చైతన్యం చేయాలని సూచించారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తరహాలో పార్టీ శ్రేణులు అందరూ ఏకతాటిపై నిలిచి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పి చేసే నాయకులను, కార్యకర్తలను పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌ రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్‌, పీసీసీ సభ్యులు మధుసూదన్‌ రెడ్డి, మండల అధ్యక్షులు సబావత్‌ బిచ్యా నాయక్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు పోతుగంటి అశోక్‌, సేవాదళ్‌ అధ్యక్షులు లక్ష్మయ్య, మాజీ కో-ఆప్షన్‌ సభ్యులు జహంగీర్‌ బాబా, కిసాన్‌ సెల్‌ అధ్యక్షులు బాలరాజు, నాయకులు సత్యం, మల్లేష్‌, యాదయ్య, చెన్నయ్య, విజరు కష్ణ, శ్రీకాంత్‌ రెడ్డి, నరసింహ, నరేందర్‌, మంకీ శ్రీను, శ్రీకాంత్‌, భరత్‌, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.