రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

– మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
నవతెలంగాణ –  హుస్నాబాద్ రూరల్ 
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ సత్తా చాటేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హుస్నాబాద్ పట్టణ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు అండగా నేనుంటానని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పని చేయాలని తెలిపారు. బోయిన్ పల్లి వినోద్ కుమార్ ను కరీంనగర్ ఎంపీగా గెలిపించుకునేందుకు అందరూ పాటు పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత వెంకన్న ,పట్టణ అధ్యక్షుడు అన్వర్, నగర పంచాయతీ మాజీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఐలేని మల్లికార్జున్రెడ్డి ,కౌన్సిలర్లు బోజు రమాదేవి రవీందర్, బోజ్జ హరీష్ తదితరులు పాల్గొన్నారు.