రేపు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

– ఎన్పీడీసీఎల్ ఏఈ వేణు కుమార్
నవతెలంగాణ – తాడ్వాయి
తాడ్వాయి మండల కేంద్రంలో నేషనల్ హైవే రోడ్డు విస్తరణ(ఫోర్ లైన్) పనుల్లో భాగంగా విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపడుతున్నామని, నేడు ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ ఏఈ వేణు కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుండి, సాయంత్రం వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని వినియోగదారులు సహకరించాలని కోరారు.