విద్యుత్ సరఫరా నిలిపివేత: ఏడీఈ వెంకటరత్నం

Power supply interruption: ADE Venkataratnamనవతెలంగాణ – అశ్వారావుపేట
శనివారం 16 తేదీ అశ్వారావుపేట సబ్ డివిజన్ పరిధిలో గల అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో 3 గంటలు పాటు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుంది అని ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం శుక్రవారం తెలిపారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నందు  మరమ్మత్తులు ఉన్నందున  అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు   అశ్వారావుపేట,దమ్మపేట,వినాయకపురం, నారంవారిగూడెం 33 కేవీ ఫీడర్ లు గల ఏరియాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుంది అని,కావున వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.