శక్తివంతమైన నాగ సాధు

Powerful Naga Sadhuతమన్నా భాటియా ప్రధాన పాత్రధారిణిగా నటిస్తున్న చిత్రం ‘ఓదెల 2’. ఇది 2021లో హిట్‌ అయిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌. అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే హ్యూజ్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. నాగ సాధు పాత్రలో తమన్నా ఫెరోషియస్‌, స్టన్నింగ్‌ పోస్టర్స్‌ క్యురియాసిటీని పెంచాయి. తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాగ సాధు అవతార్‌లో ఉన్న తమన్నాని ప్రజెంట్‌ చేస్తూ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పోస్టర్‌లో ఆమె పుర్రెలపై ధైర్యంగా నడుస్తున్నట్లు కనిపించారు, రాబందులు పైన ఎగరడం టెర్రిఫిక్‌గా ఉంది. ఈ అద్భుతమైన పోస్టర్‌ చిత్రంలో ఆమె పాత్ర ఇంటెన్స్‌, పవర్‌ఫుల్‌ నేచర్‌ని సూచిస్తున్నాయి. ప్రేక్షకులను అలరించే బ్రెత్‌ టేకింగ్‌ స్టంట్స్‌ని చేయడానికి తమన్నా తన పాత్ర కోసం ఇంటెన్స్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారు. భారీ బడ్జెట్‌, హై క్యాలిటీ ప్రొడక్షన్‌ వాల్యూస్‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఓ అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వనుంది. ఎంగేజింగ్‌ కథాకథనాలతో థ్రిల్లింగ్‌ యాక్షన్‌ను బ్లెండ్‌ చేయడంలో పాపులరైన సంపత్‌ నంది ఈ చిత్రాన్ని సూపర్‌ విజన్‌ చేస్తున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
‘తమన్నా ఇప్పటివరకు నటించిన చిత్రాలు, పాత్రలతో పోలిస్తే ఈసినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆమెను గతంలో ఎన్నడూ చూడని పాత్ర తీరు తెన్నులను ప్రేక్షకులు చూసి సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని మేకర్స్‌ అన్నారు. హెబ్బా పటేల్‌, వశిష్ట ఎన్‌ సింహ, యువ, నాగ మహేష్‌, వంశీ, గగన్‌ విహారి, సురేందర్‌ రెడ్డి, భూపాల్‌, పూజా రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: డి.మధు, దర్శకత్వం: అశోక్‌ తేజ, డీవోపీ: సౌందర్‌ రాజన్‌, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజీవ్‌ నాయర్‌.