ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్‌కి తగిన సమయం కేటాయించలేకపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా మొదటి భాగంలో మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసేందుకు మేకర్స్‌కి పవన్‌కళ్యాణ్ గ్రీన్‌సిగల్ ఇచ్చారు. దీంతో ఈనెల 23వ తేదీ నుంచి విజయవాడలో ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ని ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించ బోతున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో షూట్ చేయనున్నారు. వీరితోపాటు నాజర్, రఘుబాబు, సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటి నటులు కూడా ఈ చిత్రీకరణలో భాగం కానున్నారు. బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడుగా నటిస్తున్న ‘హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.