14 జిల్లాలకు ఇన్‌చార్జీ డీఐఈవోల నియామకం

– ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 14 జిల్లాలకు ఇన్‌చార్జీ జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యా అధికారి (డీఐఈవో)/నోడల్‌ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇంటర్‌ విద్యాశాఖ సంచాలకులు శృతి ఓజా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లకే ఇన్‌చార్జీ డీఐఈవోలుగా బాధ్యతలను అప్పగిస్తున్నట్టు తెలిపారు. ములుగు- డి చంద్రకళ, వరంగల్‌- జి శ్రీధర్‌, మహ బూబ్‌నగర్‌- జి ఉమా మహేశ్వర్‌, సిద్ధిపేట-కె రవీందర్‌రెడ్డి, జయశంకర్‌ భూపాలపల్లి – బి వెంకన్న, జగిత్యాల- కె వెంకటేశ్వర్లు, సూర్యాపేట- వి భానునాయక్‌, భద్రాద్రి కొత్తగూడెం – హెచ్‌ వెంకటేశ్వరరావు, మహబూబాబాద్‌ – సి మదార్‌, జనగామ – కె జితేందర్‌రెడ్డి, వనపర్తి – ఎ అంజయ్య, రాజన్న సిరిసిల్ల – వై శ్రీనివాస్‌, మంచిర్యాల – కటకం అంజయ్య, కొమురం భీం ఆసిఫాబాద్‌ – కళ్యాణిని ఇన్‌చార్జీ డీఐఈవోలుగా నియమించామని వివరించారు.