
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో బుధవారం పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశు వైద్యాధికారి దేవేందర్ గ్రామంలోని పశువులకు పీపీఆర్ వ్యాధి నిరోధక టీకాలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత్ పశు దన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని టీకాలు వేయడం జరిగిందని దాదాపు రెండు వేల గొర్రెలకు టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ టీకాలను మండలంలోని అన్ని గ్రామాలలో పశువులకు వేయడం జరుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది సురేష్, భరత్, తదితరులు పాల్గొన్నారు.