పూలే స్ఫూర్తితో మతోన్మాద పాసిస్ట్ బీజేపీని ఓడించండి: ప్రభాకర్

నవతెలంగాణ – ఆర్మూర్ 
సీపీఐఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండలాల ఆధ్వర్యంలో పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో శుక్రవారం జ్యోతిబాపూలే నూతన 197వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు బిదేవరాంలు మాట్లాడుతూ.. జ్యోతిబాపూలే 197వ వర్ధంతిని పురస్కరించుకొని ఆనాటి 18 వ సంవత్సర కాలంలోనే జ్యోతిరావు పూలే ఎన్నో అవమానాలను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగిందని వారు అన్నారు. బాల్యం నుంచే ప్రాథమిక విద్యను అభ్యసించి తను 13 ఏళ్ల సంవత్సరంలోనే వివాహమాడి అనేక మంది మహిళలకు పురుషులకు చదువు చెప్పడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలోనే అణగాలిన వర్గాలు వారికి జ్యోతిరావు పూలే చదువును అభ్యసిస్తున్నారని జ్యోతిరావు పూలే పైన అనేక రకాల మతోన్మాద ఫాసిస్టు మూకలు దాడిలు చేశాయని  తెలిపారు. అతని బ్రాహ్మణ స్నేహితుని వివాహంకు హాజరు కావడం జరిగిందని, అందులో జ్యోతిరావు పూలే కు తీవ్ర అవమానానికి బ్రాహ్మణ కుటుంబాలు గురిచేశాయని అన్నారు. తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి, అనేకమంది మహిళల్లో వెలుగు నింపడం జరిగిందని అన్నారు. సావిత్రిబాయి పూలేని వివిధ రకాలుగా అగ్రవర్ణ బ్రాహ్మణ కుటుంబాలు పిడకలతో దాడులు చేశాయని, అయినా వెనుకంజ వేయకుండా, ఎన్ని అవమానాలు జరిగినా తను రాత్రి బడులను నిర్వహించేదని తెలిపారు. జ్యోతిరావు పూలే సతీసహమనం, అనేక సంఘ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రవేశపెట్టిన మనుధర్మ శాస్త్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, ఈ దేశంలో లింగ వర్గ భేదాలు తారతమ్యం లేకుండా జీవించాలని కలలుగన్నారని అన్నారు. జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా మనమందరం కులాలకు, మతాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని, ఈ సమాజంలో దోపిడి వ్యవస్థకు తావివ్వకుండా పోరాటదారుల్లో ముందుకు నడవాలని అన్నారు. అదేవిధంగా నేడు భారతదేశంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న మతోన్మాద ఫాసిస్టు బీజేపీని ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఓడించాలని, అప్పుడే పూలేకు నిజమైన నివాళి అర్పించడం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ మాస్ లైన్ సంయుక్త మండలాల కార్యదర్శి బి కిషన్, నాయకులు శేఖర్, ఠాకూర్, రాజన్న, రమేష్, నరేందర్, లక్ష్మి, పద్మ, అనిల్, రోజా, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.